RAHUL ON AP SPECIAL STATUS: అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు నిన్న కలిశారన్న రాహుల్.. రైతుల పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీకీ ప్రత్యేక హోదా: రాహుల్ గాంధీ - భారత్ జోడో యాత్ర రెండో రోజు
RAHUL BHARAT JODO YATRA : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
RAHUL ON AP SPECIAL STATUS
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని.. ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ అనుభవం ఉన్న సీనియర్ నేతలే అని రాహుల్ తెలిపారు. ఎవరు ఎన్నికైనా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నామన్నారు. పొత్తుల అంశంపై నిర్ణయాధికారం కాంగ్రెస్ అధ్యక్షుడిదేనని స్పష్టం చేశారు. దేశాన్ని ఏకం చేయడమే భారత్ జోడో యాత్ర ముఖ్య లక్ష్యమని తెలిపారు. యాత్ర ద్వారా జనంతో మమేకమవుతున్నామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: