ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పల్లెలో మహిళలు రేడియోలో జానపద గాయకులు - రేడియోలో పాటలు పాడుతున్న మెులగవల్లి వాసులు

అది ఒక మారుమూల పల్లె. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. ఇప్పుడు ఆ గ్రామానికి చెందిన మహిళలే రేడియోలో పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని మెులగవల్లి కొట్టాల పల్లెపై ప్రత్యేక కథనం..!

radio singers in karnool
రేడియోలో పాటలు పాడుతున్న మెులగవల్లి వాసులు

By

Published : Jan 24, 2020, 10:57 AM IST

రేడియోలో జానపద గేయాలు పాడుతూ అలరిస్తున్న మొలగవల్లి గ్రామ మహిళలు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం మెులగవల్లి కొట్టాల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు, పది మంది పురుషులు జట్టుగా ఏర్పడి రేడియోలో జానపద గేయాలు పాడుతూ శ్రోతలను అలరిస్తున్నారు. స్థానిక పెద్దమనిషి సంగప్ప ఈరన్న సహకారంతో రేడియోలో పాటలు పాడే అవకాశం వాళ్లకు వచ్చింది. మొదట గ్రామానికి వచ్చి ...వారు పాడే పాటలు రికార్డు చేసి రేడియోలో శ్రోతల కోసం వినిపించేవారు. తరువాత గ్రూపు సభ్యులను రేడియో స్టేషన్లకే పిలిపించి పాటలు పాడిస్తున్నారు.

కళాకారుల ఫించన్​ ఇప్పించాలి

గ్రూపు సభ్యులు కర్నూలు, అనంతపురం, కడప రేడియో స్టేషన్లలో పాటలు పాడి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. పాటలు పాడేందుకు వెళ్లిన సమయంలో వారు ఇచ్చే నగదును సమానంగా పంచుకుంటారు. అరకొరగా వచ్చే ఆదాయంతో కుటుంబాలను నెట్టుకురావడం ఇబ్బందిగా ఉందని... తమలాంటి వారికి ప్రభుత్వం కళాకారుల పింఛన్ ఇప్పించాలని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

విశాఖలో అబ్బురపరిచిన కేరళ కళలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details