ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక కుందేలు.. 16 పిల్లలు..! - latest news of rabits in kurnool dst

కుందేలు సాధారణంగా ఒకేసారి 4 లేదా 8 పిల్లలకు జన్మనిస్తుంది. కానీ కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో ఆ కుందేలు మాత్రం ఏకంగా 16 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ బుజ్జి బుజ్జి కుందేళ్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలు ఆసక్తి చూపుతున్నారు.

ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన కుందేలు
ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన కుందేలు

By

Published : Sep 4, 2020, 1:29 PM IST

ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన కుందేలు

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో అన్వర్ భాష పెంచుకుంటున్న కుందేలుకు ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది. అన్వర్ బాషాకు కుందేళ్లు పెంచుకోవడమంటే సరదా. ఆయన పెంచుతున్న ఒక కుందేలు శుక్రవారం వేకువజామున ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది.

ఈ పిల్లలను చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన అని ఆళ్లగడ్డ పశు వైద్యులు డాక్టర్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా 4, లేదా 8 కుందేళ్లకు జన్మ ఇస్తుందని, అరుదుగా 12 కుందేళ్లకు జన్మనిచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనివ్వటం చాలా చాలా అరుదు అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details