ఇసుక నిల్వలు తగ్గిపోవడంతో కర్నూలు జిల్లాలో కొద్ది రోజులుగా కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుంగభద్ర నదిలో నీరు నిండడంతో ఇసుక తోడేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో కౌతాళం, మంత్రాలయం, సి.బెళగల్ మండలాల్లోని రేవుల్లో పడవల ద్వారా ఇసుకను బయటకు తీసి వాహనాల్లో కర్నూలు నగరంలోని కర్నూలు-చిత్తూరు మార్గంలో ఉన్న డిపోకు తరలిస్తున్నారు. అవసరమైన మేరకు ఇసుక లభ్యం కాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ట్రాక్టర్ డ్రైవర్లు వాపోతున్నారు.
ఇసుక కొరత.. పడిగాపులతో కలత! - ఇసుక కొరత వార్తలు
ఇసుక కొరత రాష్ట్ర ప్రజలను వేధిస్తోంది. ఇసుక కోసం రీచ్ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఇసుక దొరకటం గగనమైపోతుంది. ఇందుకు నిదర్శనమమే కర్నూలులో కనిపించిన ఈ దృశ్యం.

ఇసుక కొరత