జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో... ఆళ్లగడ్డ పరిధిలోని పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మల్లయ్య అనే కార్యకర్తకు గాయాలయ్యాయి.
జనసేన కార్యకర్తల కొట్లాట
By
Published : Feb 26, 2019, 8:12 PM IST
జనసేనలో కొట్లాట
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న మల్లయ్య అనే వ్యక్తి దాడికి గురయ్యాడు. పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా బ్యానర్లు కడుతున్న అతనితో... శూలం రామకృష్ణుడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు చూస్తుండగానే దాడికి పాల్పడ్డారు. ఘటనలో బాధితుని తలకు గాయమైంది.