కర్నూలు జిల్లా నంద్యాలలో క్వారంటైన్లలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది వాడిన పీపీఈ కిట్లును రోడ్ల పక్కన పడేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు నంద్యాల సమీపంలో ఎస్సార్బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో చికిత్స అందిస్తున్నారు.
అక్కడ సిబ్బంది వాడిన పీపీఈ కిట్లకు నిప్పు పెట్టకుండా.. రోడ్లపైనే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఈ కారణంగా.. రహదారిపై వెళ్తున్న వారు.. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడేసిన పీపీఈ కిట్లను ఇలా వదిలేస్తే కరోనా మరింత వ్యాపిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు.