అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలలకు సైతం వర్తింప చేయాలని ఏపి అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజమెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కర్నూల్లో అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొంతమంది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపే తల్లులకు మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలుస్తామని ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని సంఘం సభ్యులు కోరారు.
'అమ్మఒడి'ని ప్రైవేటు పాఠశాలలకూ వర్తింప చేయాలి - cm
అమ్మఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలలకు వర్తింప చేయాలని ఏపీ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోషియేషన్ డిమాండ్ చేసింది.
అమ్మఒడి