ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘన నివాళి - . పి వి నరసింహారావు జయంతి

మాజీ ప్రధానమంత్రి పీవీ. నరసింహారావు శత జయంతి వేడుకలను పలు జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

pv narasimha rao jayanthi celebrations  diffrent districts in andhrapradesh
పి.వి నరసింహారావు కు ఘన నివాళి

By

Published : Jun 28, 2020, 8:03 PM IST

కర్నూలులో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా జరుపుకొన్నారు. నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

కృష్ణాజిల్లాలో...

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన సంస్కరణల వల్ల దేశం, ప్రపంచంతో పోటీ పడే స్థాయికి వచ్చిందని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు.

విశాఖ జిల్లాలో...

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పీవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను గుర్తుచేసుకుంటూ దేశ అభివృద్ధికి పీవీ నరసింహారావు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా పేదలకు రొట్టెలు, పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్'​ అక్షర నివాళి

ABOUT THE AUTHOR

...view details