ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HIGH COURT: కర్నూలులో వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై పిల్‌ - vijayawada latest news

HIGH COURT: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసిన జోవో 16పై హైకోర్టులో పిల్​ దాఖలైంది. విజయవాడకు చెందిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దీనిని దాఖలు చేశారు.

HIGH COURT
HIGH COURT

By

Published : Dec 11, 2021, 5:08 AM IST

HIGH COURT: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడానికి నవంబరు 25న ప్రభుత్వం జారీచేసిన జీవో 16ను.. సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విజయవాడకు చెందిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫరూఖ్‌ షిబ్లి ఈ పిల్‌ వేశారు. మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ఏపీ వక్ఫ్‌బోర్డు సీఈవో, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌, కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

‘రాష్ట్ర విభజన తర్వాత 2016 మార్చిలో వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌ను విజయవాడలో నోటిఫై చేశారు. ఇటీవల ట్రైబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటుకు వీలుకల్పిస్తూ సవరణ చేయాలని వక్ఫ్‌ సీఈవో ప్రభుత్వానికి విన్నవించారు. ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది. దీని వెనుక మైనార్టీల సంక్షేమం ఇమిడి లేదు. ఇది అధికారాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే’ అని అందులో వివరించారు. శుక్రవారం హైకోర్టు ప్రారంభంకాగానే ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సోమవారం విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details