కర్నూలు జిల్లా ఆదోనీలో టీజీఎల్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గుంతలు ఉన్న రహదారులను మట్టితో మరమ్మత్తులు చేయటాన్ని స్థానికులు తప్పు పట్టారు. గుంతలు ఉన్న రహదారులను... మట్టితో కాకుండా... మంచి రోడ్డు వేయాలని ధర్నా చేయటంతో ప్రయాణీకులకు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు జోక్యంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.
'రహదారులపై గుంతలు... మట్టితో మరమ్మత్తులు' - public dharna in kurnool district
ఆదోనిలో రహదారులకు మట్టితో మరమ్మత్తులు చేస్తుండగా స్థానిక టీజీఎల్ కాలనీ వాసులు అధికారులను అడ్డుకున్నారు. నాణ్యమైన రోడ్లు వెయ్యండి అంటూ.... ఆందోళన చేపట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.
'రహదారులపై గుంతలు... మట్టితో మరమ్మత్తులు'