ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ధర్నా - Peoples oraganisations protest latest News

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులకు న్యాయం చేయాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉప తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు.

కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ధర్నా
కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ధర్నా

By

Published : Oct 3, 2020, 6:06 PM IST

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులకు న్యాయం చేయాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి, ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. పొంతన లేని ప్రకటనలతో బాధితులకు అన్యాయం చేసేందుకు పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతరం ఉప తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు రామచంద్రుడు, రాజునాయుడు, బాషా, నాయక్​లు డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details