ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు విమానాశ్రయ శిలాఫలకంలో ప్రొటోకాల్ వివాదం - Kurnool District Latest News

కర్నూలు విమానాశ్రయ శిలాఫలకంలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. ఓర్వకల్లు సర్పంచి తోట అనూష పేరును అధికారులు మరిచిపోయారు. స్పందించిన కలెక్టర్.. శిలాఫలకంలో సర్పంచి పేరు చేరుస్తామని ప్రకటించారు.

ప్రొటోకాల్ వివాదం
ప్రొటోకాల్ వివాదం

By

Published : Mar 25, 2021, 10:23 PM IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ శిలాఫలకంలో ప్రొటోకాల్ వివాదం చర్చనీయాంశమైంది. స్థానిక సర్పంచి తోట అనూష పేరును అధికారులు శిలాఫలకంలో పెట్టలేదు. తన పేరు లేదని అనూష సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.

ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ వీరపాండియన్.. శిలాఫలకంలో సర్పంచ్ పేరు చేరుస్తామని చెప్పారు. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద సుమారు వెయ్యి ఎకరాల్లో చేపట్టిన విమానాశ్రయం నిర్మాణం ఇటీవలే పూర్తి కాగా ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details