వలస కార్మికులను ఆదుకోవాలని నిరసన - కర్నులులో వలస కార్మికుల వార్తలు
వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలంటూ... కర్నూల్లో ఏ.ఐ.వై.ఎఫ్ ఆధ్యర్యంలో వినూత్న నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకొని... వలస కూలీలకు ఆర్థిక సాయం అందించాలంటూ డిమాండ్ చేశారు.
![వలస కార్మికులను ఆదుకోవాలని నిరసన protests for central and state governments to support migrant workers due to corona lockdown at kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7316222-942-7316222-1590236706388.jpg)
protests for central and state governments to support migrant workers due to corona lockdown at kurnool
వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కర్నూల్లో ఏ.ఐ.వై.ఎఫ్ ఆధ్యర్యంలో కళ్లకు గంతులు కట్టుకొని నిరసన తెలిపారు. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... వారికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సందర్బంగా ప్రతి నిరుద్యోగికి పదివేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి:'సీఎం గారూ.. ఇచ్చిన హామీని నెరవేర్చండి'