YSRCP Gadapa Gadapaku: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసనల సెగ తగిలింది. ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను స్థానిక మహిళలు సమస్యలపై నిలధీశారు. ఎస్సీ కాలనీలో మురుగు కాలువ నీరును బీసీ కాలనీ కాలువలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేతో మొర పెట్టుకున్నారు. ఫలితంగా ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోందని వాపోయారు. దీనిపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ ఆవేశంతో ఊగిపోయారు. 30 ఏళ్లుగా సమస్య ఉంటే.. తాము వచ్చినప్పుడే అడుగుతారా అంటూ.. ఆవేశంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే సాయిప్రసాద్.. 30 ఏళ్లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
30 ఏళ్లుగా సమస్య ఉంటే... నన్నెందుకు అడుగుతున్నారు.. మహిళపై ఎమ్మెల్యే ఆగ్రహం - అలసంద గుత్తిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసన సెగ
YCP Gadapa Gadapaku at Gutti: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో అధికార వైకాపా నేతలపై నిరసనల పర్వం కొనసాగుతోంది. కర్నూలు జిల్లా అలసంద గుత్తిలో పర్యటించిన ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని స్థానిక మహిళలు సమస్యలపై నిలదీశారు. దీంతో ఆవేశంలో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసనల సెగ
Last Updated : Jun 1, 2022, 7:28 PM IST