'పౌర' సవరణకు వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు - కర్నూలులో పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా నిరసనలు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆద్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ముస్లింలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ హాజరై.. మద్దతు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.