కర్నూలు జిల్లా నంద్యాలలో రాయలసీమ సాగునీటి సమితి నాయకులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. స్థానికులకు కరపత్రాలు అందజేసి భిక్షాటన చేశారు.
నంద్యాలలో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో భిక్షాటన - Kurnool district latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో రాయలసీమ సాగునీటి సమితి నాయకులు, రైతులు భిక్షాటన చేశారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటును నిరసిస్తూ.. చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది.
నంద్యాలలో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో భిక్షాటన
వైద్యకళాశాల ఏర్పాటుకు భూములు కొనుగోలు చేయలేక పోతే.. తామే భిక్షాటన చేసి నిధులు సమకూర్చి ప్రభుత్వానికి అందజేస్తామని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. మార్చి 1వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని నంద్యాల డివిజన్లోని మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ప్రాణాలు తీస్తారా?: చంద్రబాబు