ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైద్య సిబ్బంది ఆందోళన - protest of medical staff news

కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైద్య సిబ్బంది ఆందోళన చేశారు. కరోనా సమయంలో సేవలందించేందుకు నియమించి.. వైరస్​ తగ్గుముఖం పడుతుండటంతో విధుల నుంచి తొలగింటం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

protest of medical staff
వైద్య సిబ్బంది ఆందోళన

By

Published : Dec 10, 2020, 5:54 PM IST

కొవిడ్​ సమయంలో విధుల్లో నియమించి..ప్రస్తుతం తొలగించటాన్ని వ్యతిరేకిస్తూ వైద్య సిబ్బంది కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగులు సైతం విధులు నిర్వహించేందుకు భయాందోళన చెందారు. అలాంటి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నిషియన్లుగా ప్రజలకు సేవ చేశామని సిబ్బంది పేర్కొన్నారు. వైరస్​ వ్యాప్తి తగ్గుతుండటంతో తమను ఉద్యోగం నుంచి తొలగించటం సరైంది కాదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి.. తమకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details