ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాణ్యం వద్ద రైతు సంఘం నాయకుల రాస్తారోకో - panyam latest news

కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జాతీయ రహదారిపై రైతు సంఘం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

protest of farmer association leaders
రాస్తారోకో నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు

By

Published : Nov 5, 2020, 1:46 PM IST

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా పాణ్యం వద్ద రైతు సంఘం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సర్కారు అనుసరిస్తున్న విధానాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి రాకపోకలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి..వాహనదారుల ఇబ్బందులు తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details