కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో విజయలక్ష్మి అనే మహిళ సర్పంచ్‌గా నామినేషన్ వేసింది .అయితే నామినేషన్ ఉపసంహరణ తన ప్రమేయం లేకుండా ఫోర్జరీ సంతకం చేసి పక్కన పెట్టారని ఆమె ఆరోపించింది. తన మద్దతుదారులతో కలిసి యాగంటిపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
అభ్యర్థికి తెలియకుండానే.. నామినేషన్ ఉంపసహరణ - యాగంటిపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట నిరసన
అభ్యర్థికి తెలియకుండానే తన నామినేషన్ ఉంపసహరణ చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. తనకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఆమె ఎదుట నిరసనకు దిగారు.
అభ్యర్థికి తెలియకుండానే.. నామినేషన్ ఉంపసహరణ
తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. తనకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:గుర్తుల ఉపసంహరణతో.... అభ్యర్థుల్లో ఆందోళన