సమాధానం చెప్పండి.. గడప గడపకు కార్యక్రమంలో మంత్రిని ప్రశ్నించిన ప్రజలు - Villagers blocked minister in Tangaradona
Gadapa Gadapaku Mana Prabhuthvam గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగులుతూనే ఉంది. ఎన్నికల వేళ హామీలు ఇచ్చి గెలిచి.. మాట తప్పిన నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది.
మంత్రి జయరాం
Minster Jayaram: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని తంగరడోనలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జయరాంకు గ్రామస్థుల నుంచి నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో గ్రామానికి రహదారి, ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటివరకు ఏదీ నెరవేర్చలేదని గ్రామస్థులు మంత్రిని నిలదీశారు. గ్రామస్థులను పోలీసులు అదుపు చేయాలని ప్రయత్నించినా.. గ్రామస్థులు మాత్రం మంత్రిని అడ్డుకున్నారు.