కొద్ది రోజులుగా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1704.53 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 127.10 టీఎంసీలుగా నమోదైంది. ఇన్ ఫ్లో 98,270 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,11,279 క్యూసెక్కులు ఉంది.
నారాయణపూర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1612.43 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 34.12 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులో 1,62,848 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,67,718 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1037.86 అడుగులు ఉంది . పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 5.70 టీఎంసీలు. ఇన్ ఫ్లో 4,93,628 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,27,563 క్యూసెక్కులు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 882.20 అడుగులకు చేరింది.. పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 200.20 టీఎంసీలు. 6,42,283 క్యూసెక్కులు జలాశయంలో చేరుతుండగా.. 7,18,300 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.