ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నేపథ్యంలో కర్రల సమరం నిషేధం - Kurnool latest news

కర్నూలు జిల్లాలో ఏటా విజయదశమి సందర్భంగా జరిగే కర్రల సమరాన్ని కరోనా నేపథ్యంలో ఈసారి అధికారులు నిషేధించారు. దేవరగట్టుకు వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. ఇవాళ రాత్రి జరిగే ఉత్సవానికి బయటి వారిని ఎవరినీ అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Prohibition of stick fighting in the background of the corona
కరోనా నేపథ్యంలో కర్రల సమరం నిషేధం

By

Published : Oct 26, 2020, 7:52 AM IST

కరోనా నేపథ్యంలో కర్రల సమరం నిషేధం

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా సందర్భంగా... కర్రల సమరాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ ఏడాది దీన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు దారితీసే ఈ కర్రల సమరాన్ని అరికట్టేందుకు గతంలో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఆఖరికి కరోనా దెబ్బకు ఈ సంప్రదాయానికి బ్రేక్‌ పడ్డట్టైంది.

జైత్రయాత్రగా బయల్దేరే తమ ఇలవేల్పు మాళమ్మ, మల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ విగ్రహాలను చేజిక్కుంచుకునేందుకు ఇరువర్గాల ప్రజలు పోటీ పడుతూ జరిపే ఉత్సవాన్నే... బన్ని ఉత్సవం అంటారు. ఇందులో భాగంగా కర్రలతో యుద్ధం చేసుకుంటారు. నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామస్థులు మరో జట్టుగా తలపడతారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచీ లక్షల మంది తరలివస్తారు. ఈసారి వీరందరినీ దేవరగట్టుకు వెళ్లనీయకుండా రహదారులన్నీ మూసివేశారు.

కర్రల సమరం ఎందుకు జరగట్లేదన్న విషయాన్ని సమీప గ్రామాల్లో అవగాహన కల్పించామని.. ప్రజలంతా సహకరిస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. తరాలుగా వస్తున్న బన్ని ఉత్సవాన్ని రద్దు చేయడంపై స్థానికులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ... ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు... విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details