రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీలు పని కోసం గుంటూరు జిల్లాకు వెళ్లి లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరుకు చెందిన 60 మంది వలస కూలీలు మిరపకాయలు కోసేందుకు గుంటూరు జిల్లాకు వెళ్లారు. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో వాళ్లు అక్కడినుంచి సొంత ఊరికి కాలినడకన బయలుదేరారు. గుంటూరు నుంచి కోటప్పకొండ చేరగా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని తిరిగి గుంటూరుకు తరలించారు. దీంతో తమను ఎలాగైనా స్వగ్రామానికి చేర్చాలని వేడుకుంటున్నారు.
'మమ్మల్ని పట్టించుకోండి..స్వస్థలానికి చేర్చండి' - కర్నూలులో వలస కూలీల ఇబ్బందులు
కూలి పని కోసం తమ ఊరు, జిల్లా కాదని వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా మరో జిల్లాలో చిక్కుకుపోయారు... ఎలాగైనా ఇంటికి వెళ్లాలని స్వగ్రామానికి బయలుదేరారు. పోలీసులు వెళ్లనివ్వలేదు... పని లేక.. ఊరికి పోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వలస కూలీలు.
Problems of migrant workers due to corona lockdown at kurnool