కరోనా సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కర్నూల్లో కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసినా ఉపాధ్యాయులకు మాత్రం వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా సంస్థల నుంచి ఉపాధ్యాయులకు వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కిన ప్రైవేటు ఉపాధ్యాయులు - జీతాలు చెల్లించాలని రోడ్డెక్కిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు
కరోనా సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఫీజులు వసూలు చేసినా తమకు వేతనాలు మాత్రం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీతాలు చెల్లించాలని రోడ్డెక్కిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు