కర్నూలు జిల్లా నంద్యాలలోని పలు కూడళ్లలో, కిరాణా దుకాణాల వద్ద నిత్యావసర ధరల సూచికలను అధికారులు ఏర్పాటు చేశారు. కిలో బియ్యం రూ. 45, కందిపప్పు రూ. 80, 90, మినపప్పు రూ. 100, శనగపప్పు రూ. 56, గోధుమ పిండి రూ. 27, జొన్న పిండి రూ. 40, పెసరపప్పు రూ. 110తో విక్రయించాలని తెలిపారు. అలాగే రైతు బజార్లో నిర్దేశించిన ధరలకే కూరగాయలు అమ్మాలని వివరించారు. అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీ నెంబర్ 1902కు ఫిర్యాదు చేయాలని ప్రజలను అధికారులు కోరారు.
నంద్యాలలో నిత్యావసర ధరల సూచిక ఏర్పాటు
నిత్యావసర సరుకల ధరల పట్టిక సూచికలను కర్నూలు జిల్లా నంద్యాలలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే 1902 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారం అందించాలని కోరారు.
నంద్యాలలో ధరల పట్టిక సూచికను కిరాణా దుకాణాల వద్ద ఏర్పాటు