రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికలపై చర్చించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2022లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో వైకాపా సమాధి అవుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సానుభూతి పరులు బెదిరింపులకు భయపడవద్దని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి నోరుమెదపడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా నాయకులను లక్ష్యంగా చేసుకొని అక్రమంగా కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు.
'రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి' - రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు.
'రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి'
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లడుతూ రాష్ట్రంలో వైకాపా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీఎం, మంత్రులు ఉన్మాదంలో పోటీ పడుతున్నారు: చంద్రబాబు