కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళలు, ఓ చిన్నారి సహా యాత్రికులు మృతి చెందడం హృదయ విదారకంగా ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి - కర్నూలులో రోడ్డు ప్రమాదంపట్ల రాష్ట్రపతి సంతాపం
కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
![కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి President and Vice president condolence on kurnool accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10621703-213-10621703-1613287712172.jpg)
కర్నూలులో రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం
కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ...క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఇదీ చూడండి.రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం