కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘంలో తమ గ్రామ పంచాయతీల విలీనం చేయొద్దంటూ 6 గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. విలీనం ఆపాలంటూ... పురపాలక కార్యాలయం దగ్గర నినదించారు. ఈ విలీన ప్రక్రియ చేస్తున్న....పురపాలక కమిషనర్ కన్యాకుమారి వారం రోజులు సెలవు పై వెళ్లారు. విలీనంతో తమ ప్రాంతాల్లో రుసుములు పెరుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆదోనిలో తాగునీటి సమస్య ఉందని....విలీనం చేస్తే గ్రామాల్లో సమస్యలు మరింత పెరుగుతాయని వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.
పంచాయతీలను పురపాలికలో కలపొద్దంటూ.. ధర్నా - ఆదోని పురపాలక సంఘం తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆదోని పురపాలిక పరిధిలోని 6 పంచాయతీల ప్రజలు ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను పురపాలికలో కలపొద్దంటూ ఆరు పంచాయతీల గ్రామస్థులు ధర్నా చేశారు.
![పంచాయతీలను పురపాలికలో కలపొద్దంటూ.. ధర్నా Preparing for the merger of village panchayats in the Adoni municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5565722-804-5565722-1577939469986.jpg)
ఆదోని పురపాలక కార్యాలయంలో ధర్నా చేస్తున్న గ్రామస్థులు
ఆదోని పురపాలికలో గ్రామ పంచాయతీల విలీనానికి రంగం సిద్ధం