ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pregnant womens struggle: స్కానింగ్‌ కోసం బారులు తీరిన గర్భిణులు.. కుర్చీలు లేక నేలపై.. - ఆదోని మహిళ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్​ వద్ద గర్భిణుల అవస్థలు

Pregnant womens struggle At Adoni: కర్నూలు జిల్లా ఆదోని మహిళ ఆసుపత్రిలో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్​ వద్ద బారులు తీరారు. స్కానింగ్ కోసం వచ్చిన వాళ్లు.. కుర్చీలు లేకపోవడంతో నెలపైనే కూర్చున్నారు.

ఆదోని మహిళ ఆసుపత్రిలో గర్భిణుల అవస్థలు
ఆదోని మహిళ ఆసుపత్రిలో గర్భిణుల అవస్థలు

By

Published : Dec 10, 2021, 1:36 AM IST

Pregnant womens struggle: కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో స్కానింగ్ పరీక్షల కోసం గర్భిణులు బారులు తీరారు. ఈ రోజు స్కానింగ్‌ కోసం దాదాపు 350 మంది ఆస్పతికి రాగా... కుర్చీలు లేకపోవటంతో గర్భిణులు నేలపై కూర్చున్నారు. స్కానింగ్‌ కోసం చాలా సమయం పడుతుందని క్యూలైన్లోనే భోజనాలు చేయాల్సి వస్తోందని గర్భిణులు చెబుతున్నారు.

ప్రతి నెలా 9న నెలలు నిండిన గర్భిణులకు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. స్కానింగ్‌ కోసం అధిక సంఖ్యలో గర్భిణులు వస్తారని తెలిసి కూడా తగిన వసతులు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details