ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్లక్ష్యంగా అధికారులు.. స్కానింగ్ కోసం క్యూలో గర్భిణుల ఇబ్బందులు - అదోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యూలో గర్భిణీలు

కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారుల నిర్లక్ష్యానికి గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. వారందరూ కరోనా ఉందన్న ధ్యాసే మరిచి.. భౌతికదూరం పాటించకుండా వరుసలో నిలబడ్డారు.

pregnant women queue at adhoni
అదోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యూలో గర్భిణీలు

By

Published : May 10, 2021, 8:41 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో గర్భిణులు స్కానింగ్ కోసం బారులు తీరారు. పట్టణంలోని మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం నుంచి స్కానింగ్ కోసం భారీ ఎత్తున్న వరుసలో నిలబడ్డారు. కోవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించకుండా నిల్చున్నారు.

రోజూ కరోనా కేసులు పెరుగుతున్నా.. అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం, వరుసలో గంటల తరబడి నిలబడటం ఇబ్బందిగా ఉందని గర్భిణులు వాపోయారు. సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details