కర్నూలు జిల్లా నంద్యాల వై.ఎస్. నగర్‌కు చెందిన లక్ష్మీదేవి(24) అనే మహిళను.. అదే కాలనీకి చెందిన సుశీలమ్మ హత్య చేసింది. నంద్యాల గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మీదేవి తండ్రి వెంకట్రాముడు సుశీలమ్మ అనే మహిళతో సంబంధం కలిగిఉన్నాడు. ఈ విషయంపై లక్ష్మీదేవి తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగేవి.
కుటుంబ వివాదాలతో గర్భిణీ దారుణ హత్య - నంద్యాల గర్భిణీ హత్య కేసు
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీపై మరో మహిళ కత్తితో దాడిచేసింది. కుటుంబ వివాదాల వల్ల ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ గొడవలో మహిళ... గర్భిణీపై దాడికి పాల్పడి హత్య చేసిందని పేర్కొన్నారు.
బుధవారం వెంకట్రాముడు సుశీలమ్మ ఇంటికి వెళ్లాడని తెలిసి... లక్ష్మీదేవి ఆమె తల్లి భారతి సుశీలమ్మ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో సుశీలమ్మ, లక్ష్మీదేవి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదంలో లక్ష్మీదేవి తాళిబొట్టును సుశీలమ్మ తెంపి..ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన లక్ష్మీదేవిపై సుశీలమ్మ కత్తి దాడి చేసి హత్య చేసింది. తీవ్ర గాయలపాలైన లక్ష్మీదేవి మృతి చెందింది. ఆమె తల్లి భారతిపై కూడా సుశీలమ్మ కత్తితో దాడిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల గ్రామీణ సీఐ దివాకరరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి :తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ