కర్నూలు జిల్లా హోళగుందలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. హోళగుందకు చెందిన తైసీన్కు పురిటి నొప్పులు రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితురాలు వెళ్లిన సమయానికి వైద్యులు, సిబ్బంది ఎవరు లేరని తైసీన్ అక్క తెలిపారు. హరిశ్చంద్రుడనే ఆసుపత్రి వైద్యుడికి సమాచారం చేరవేసినా...ఆయన స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఆదోనికి తీసుకవెళ్లాలని సూచించారని..వేరే ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలోనే తైసీన్ మరణించిందని మృతురాలి సోదరి తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన చెల్లెలు చనిపోయిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
హోళగుందలో గర్భిణీ మృతి - హోళగుందలో నేర వార్తలు
కర్నూలు జిల్లా హోళగుందలో ఓ గర్భిణీ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.
హోళగుందలో గర్భిణీ మృతి