శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా.. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని కొండపై వెలసిన కొండరాయుడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. పట్టణంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
ఉత్సవాల సందర్భంగా.. కొండపైన అనేక సంఖ్యలో తేళ్లు కనిపిస్తాయి. వీటిని చిన్నాపెద్ద అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ పట్టుకుని విన్యాసాలు చేశారు. నోటిపై, చేతులపై, తలపై పెట్టుకుని పూజించారు. అనంతరం కొండరాయుడికి తేళ్లతో అభిషేక పూజలు చేశారు.