శ్రీశైలం వెనుకజలాలను రాయలసీమకు తరలించే ఉద్దేశంతో... ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా గతంలో అత్యధికంగా 20 వేల క్యూసెక్కుల వరద నీటిని మాత్రమే తరలించేవారు. ఈ మధ్యనే విస్తరణ పనులు పూర్తి చేసుకోవటంతో... 40 వేల క్యూసెక్కులు తీసుకునే వీలు కలిగింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటం, శ్రీశైలం పూర్తిగా నిండిపోవటంతో పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకుంటున్నారు. వీటిని తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, కేసీ ఛానళ్లకు తరలిస్తున్నారు. ఫలితంగా సీమలోని జలాశయాలు కృష్ణా నీళ్లతో నిండుకుండలా మారనున్నాయి.
పోతిరెడ్డిపాడుకు రికార్డుస్థాయిలో నీటివినియోగం - kurnool
రాయలసీమ జిల్లాల జీవనాడి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచిరికార్డు స్థాయిలో నీటి వినియోగం జరుగుతోంది.
పోతిరెడ్డిపాడు