ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని పోస్టల్ ఉద్యోగుల ధర్నా - kurnool latest news

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ పోస్టల్ ఉద్యోగులు కర్నూలులో ధర్నా చేశారు. కరోనా సమయంలో చనిపోయిన వారికి ఇస్తామన్న రూ.10లక్షల నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

postal employees dharna
సమస్యలు పరిష్కరించాలని పోస్టల్ ఉద్యోగుల ధర్నా

By

Published : Mar 18, 2021, 2:59 PM IST

అఖిల భారత తపాల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా కర్నూలు కేంద్ర తపాల కార్యాలయం ఎదుట పోస్టల్​ ఉద్యోగులు ధర్నా చేశారు. కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 లక్షల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. టార్గెట్ పేరుతో ఉద్యోగుల పట్ల వేధింపులను ఆపాలన్నారు. మూసివేసిన 30 సబ్ పోస్టాఫీసులను వేరే ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలన్నారు. తపాల శాఖలో చాలా సంవత్సరాలుగా ఉద్యోగులు కొరత ఉందన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details