తెలంగాణ మద్యం స్వాధీనం...ఇద్దరు అరెస్ట్ - illicit liquor latest news kurnool
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ... అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు.

మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
కర్నూలు తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో వారిని అదుపులో తీసుకుని విచారించారు. వారు తెలంగాణ నుంచి తెచ్చిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేయటంతో పాటు 25 మద్యం సీసాలను, ఓద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.