ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్‌ఎస్‌టీఆర్​లో 63కు పెరిగిన పెద్ద పులుల సంఖ్య - tigers news

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్‌ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్‌)లో పెద్దపులుల సంఖ్య 63కు పెరిగిందని అటవీ సంరక్షణాధికారి తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు గుండ్లబ్రహ్మేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో శాస్త్రీయ గణన చేపట్టనున్నట్లు చెప్పారు.

population of tigers
పెరిగిన పెద్ద పులుల సంఖ్య

By

Published : Feb 20, 2021, 8:01 AM IST

నాగార్జునసాగర్ ‌- శ్రీశైలం టైగర్‌ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్‌)లో 2018లో బ్లాక్‌-1లో 46 ఉన్న పెద్దపులుల సంఖ్య... ప్రస్తుతం 63కు పెరిగిందని కర్నూలు- కడప జిల్లాల అటవీ సంరక్షణాధికారి రామకృష్ణ వెల్లడించారు. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం పచ్చర్ల పర్యాటక విడిది కేంద్రంలో నాలుగో విడత పర్యవేక్షణ, ట్రాప్‌ కెమెరాల పనితీరుపై కింది స్థాయి సిబ్బంది, అటవీశాఖ అధికారులకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌ఎస్‌టీఆర్‌లోని ఉన్న గుండ్లబ్రహ్మేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు (45 రోజులు) ట్రాప్‌ కెమెరాల ద్వారా శాస్త్రీయ గణన చేపట్టనున్నట్లు చెప్పారు. పులుల గణనకు ట్రాప్‌ కెమెరాలను సిబ్బంది సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details