కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో చెరువు నీరు వృథాగా పోతోంది. తూము నుంచి బయటకు వెళుతున్న నీరు పొలాల్లోకి చేరుతోంది.
ఈ విషయంపై రైతులు మాట్లాడుతూ.. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు కావాలనే నీటిని బయటకు పంపుతున్నారని ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని మత్స్యకారులు అంగీకరించడం లేదు.