కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో వెంకటేశ్వర పురం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆటోలో తెలంగాణకు చెందిన 71 మద్యం సీసాలను తరలిస్తూ పోలీసులకు దొరికాడు. అతనిని అరెస్ట్ చేసి... ఆటో, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ దివాకర రెడ్డి తెలిపారు.
వెంకటేశ్వరపురం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత - telangana alcohol at venkateswarapuram
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో వెంకటేశ్వరపురం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![వెంకటేశ్వరపురం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత police take over telangana alcohol at venkateswarapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8596134-551-8596134-1598631055293.jpg)
వేంకటేశ్వరపురం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత
ఇదీ చూడండి.వాడపల్లిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం