కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నతాధికారులు వేధింపులు తాళలేక ఓ పోలీస్ రాజీనామాకు సిద్ధపడ్డారు. పట్టణంలో తాలూక పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగరాజు... ఇటీవలే వెల్దుర్తి నుంచి ఆదోనికి బదిలీ అయ్యారు. ఒక వర్గానికి చెందిన పోలీస్ అధికారి వేధింపులకు గురిచేసి మానసికంగా వేధిస్తున్నారని ఏఎస్సై నాగరాజు వాపోయారు. తనకు, తన భార్యకు ఆరోగ్య సమస్యలున్నాయని... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రాజీనామా చేస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
'కావాలని వేధిస్తున్నారు... పనిచేయలేకపోతున్నా' - police frustration
అధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ ఏఎస్సై... రాజీనామాకు సిద్ధపడ్డాడు. తన బాధను సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఏఎస్సై నాగరాజు