ఏపీ - తెలంగాణ సరిహద్దులోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో.. 77 లక్షల 50 వేల రూపాయలు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో.. డబ్బులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాకు చెందిన మధురాజ్ షణ్ముగం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి.. పలు అంశాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పంచలింగాల చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత - కర్నూలు- తెలంగాణ సరిహద్దుల్లో భారీగా నగదు పట్టివేత తాజా అప్ డేట్స్
పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో.. 77 లక్షలా 50 వేల రూపాయలను పోలీసులు గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. పలు అంశాలపై విచారణ చేపట్టారు.
money sized