అనంతపురం జిల్లా మడకశిర ఎస్సై శేషగిరి.. సిబ్బందితో కలిసి అక్రమంగా సాగుతున్న మద్యం రవాణాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 740 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కర్ణాటకకు చెందిన వెంకట చలపతి అనే వ్యక్తి, తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై 740 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్నారు. గోవిందాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల రాకను గమనించిన కుమారుడు తప్పించుకోగా.. తండ్రి తలపతి పట్టుబడ్డాడు.
seized: 740 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత - 740 packets of Karnataka liquor seized at Anantapur district
మడకశిర మండలం గోవిందాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు చేపట్టిన దాడుల్లో.. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 740 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి.
కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత
ఘటనా స్థలంలో పట్టుబడ్డ వస్తులను పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం రవాణా చేసినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
ఇదీ చదవండీ...Raghurama Case: ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు