కర్నూలులో నకిలీ మద్యం కేసులో నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ ఇంట్లో పోలీసులు భారీ బలగాలతో సోదాలు నిర్వహించారు. గతేడాది డిసెంబర్లో డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం దొరికింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయగా... కేఈ ప్రతాప్ హస్తం ఉన్నట్లు నిర్ధరించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రతాప్ స్వగృహంలో 25 ఖాళీ క్యాన్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కేఈ కృష్ణమూర్తి సోదరుని ఇంట్లో పోలీసుల సోదాలు - కే.ఈ ప్రతాప్ ఇంట్లో పోలీసుల సోదాలు వార్తలు
కర్నూలు జిల్లా డోన్‌లో దొరికిన నకిలీ మద్యం కేసులో... నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో మొత్తం 36 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
![కేఈ కృష్ణమూర్తి సోదరుని ఇంట్లో పోలీసుల సోదాలు police searches in accused houses in fake liquor case at Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5974754-464-5974754-1580969811385.jpg)
కే.ఈ ప్రతాప్ ఇంట్లో పోలీసుల సోదాలు