Mobile phones: కర్నూలు జిల్లాలో సుమారు రూ.2.50 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. 1,047 ఫోన్లను బాధితులకు అప్పగించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మొబైల్ రికవరీ మేళాలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. ఆ ఫోన్లను ప్రజలకు అందజేశారు. మొబైల్ ఫోన్పోతే 'మీ సేవా' కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని, లేదంటే kurnoolpolice.in/mobiletheft లింకును క్లిక్ చేసి వివరాలను తెలియజేయాలని ఎస్పీ తెలిపారు. 4 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయని.. వాటిన్నింటినీ రికవరీ చేయటానికి ప్రయత్నిస్తామని వివరించారు.
Mobile phones: భారీగా మొబైల్ ఫోన్స్ రికవరీ... బాధితులకు అందజేత - మొబైల్ ఫోన్స్ స్వాధీనం
Mobile phones: కర్నూలు జిల్లా పోలీసులు రికవరీ చేసిన వెయ్యికి పైగా ఫోన్లను.. సొంతదారులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మొబైల్ రికవరీ మేళాలో.. ఎస్పీ సిద్దార్థ కౌశల్ బాధితులకు ఫోన్లు అందించారు. ఆన్‌లైన్ ఫిర్యాదులతో పోలీసు బృందాలు స్పందించి ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
భారీగా మొబైల్ ఫోన్స్ రికవరీ