ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై పోలీసుల ఉక్కుపాదం - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపారు. జిల్లా కేంద్రంలో నిల్వ ఉంచిన 93 టన్నుల బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ లారీని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

police raids on illegal ration rice storage and transport
రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై పోలీసుల ఉక్కుపాదం

By

Published : Jan 15, 2021, 4:44 PM IST

కర్నూలు జిల్లాలోని పట్టణ కేంద్రంలో నాలుగు గోడౌన్లలో 93 టన్నులు రేషన్ బియ్యాన్ని గుర్తించి.. వాటిని పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని పలు గోడౌన్లలో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో డీఎస్పీ కేవీ మహేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు గోడౌన్ నిర్వహకుల్నీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

గుజరాత్​కు తరలిస్తుండగా..

కర్నూలు సమీపంలోని తడకనపల్లె గ్రామం వద్ద ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనీఖీ చేస్తుండగా.. ఓ లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యాన్ని డోన్​కు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి గుజరాత్​కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 25 కేజీల బరువు గల 1200 ప్యాకెట్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: అక్రమ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details