ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో పోలీసుల దాడులు.. 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - Police raids on illegal liquor bases in Adoni

కర్నూలు జిల్లా ఆదోనిలో సారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

illegal liquor bases
సారా బట్టీలపై దాడులు

By

Published : Jun 12, 2021, 9:57 AM IST

Updated : Jun 12, 2021, 10:21 AM IST

కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతా కొండల్లోని నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములు, సారా తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కొండ ప్రాంతాల్లో పెరుగుతున్న అనధికార సారా తయారీ అమ్మకాలను అరికట్టేందుకు దాడులు నిర్వహిస్తూనే ఉంటామని సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు, నాటు సారా తయారీవంటి ఘటనలకు పాల్పడితే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Last Updated : Jun 12, 2021, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details