ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో పోలీసుల సోదాలు

Police Raids In Sunil Kanugolu Office: రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో.. సైబరాబాద్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎస్​కే కార్యాలయంలో సోదాలు చేసిన అధికారులు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లు సీజ్‌చేశారు. పోలీసుల దాడిని ఖండించిన హస్తం పార్టీ నేతలు.. హైదరాబాద్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద నిరసనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు.

Sunil Kanugolu
సునీల్‌ కనుగోలు

By

Published : Dec 14, 2022, 10:54 AM IST

Police Raids In Sunil Kanugolu Office: ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేశారు. ఫేస్‌బుక్‌లో రెండు పేజీలు నిర్వహిస్తున్న ఆయన బృందం.. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై సునీల్‌ కనుగోలు కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు తీసుకున్నారు. దాదాపు 6 గంటలు సోదాలు చేసిన అధికారులు హార్డ్‌డిస్క్‌లు, లాప్‌టాప్‌లు, స్వాధీనం చేసుకున్నారు.

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో పోలీసుల సోదాలు

రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది: దాడి గురించి తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్అలీ, మల్లు రవి, అనిల్‌ కుమార్ యాదవ్ సహా.. పలువురు నేతలు సునీల్‌ కనుగోలు కార్యాలయానికి వెళ్లారు. సునీల్‌ కార్యాలయాన్ని కుట్రపూరితంగా జప్తు చేశారని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా సీజ్ చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే కాంగ్రెస్‌ నాయకులు ధర్నాకు దిగారు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంటివద్ద వదిలి వెళ్లారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని నేతలు మండిపడ్డారు.

పోలీసుల పెత్తనమేంటి:సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో పార్టీ వ్యవహారాలు జరుగుతాయని.. అక్కడ పోలీసుల పెత్తనమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందు వల్లే పోలీసులు అలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. ప్రజల స్వేచ్ఛను రాజకీయ పార్టీల హక్కులను పోలీసులు కాల రాస్తున్నారని మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్‌ ఆరోపించారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు:సునీల్‌ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడంపై ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్​ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. హైదారాబాద్‌లో పోలీస్‌ కార్యాలయం వద్ద నేడు ఆందోళనకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు.. సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు రేవంత్‌ సూచించారు.

"సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా పోస్ట్​ పెట్టారని పోలీసులు అంటున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లడతాయి. అలా అయితే ఆ పోస్ట్ పెట్టిన కాపీ ఇవ్వండి. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. నోటీసులు ఇవ్వలేదు. కేసు ఎవరు పెట్టారో తెలియదు." -మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్‌ నేత

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details