కర్నూలు జిల్లాలో ఆదోనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణంలోని రెండో పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద మసీదు, హవనపేట మీదుగా బీమాస్ కూడలి వరకు కవాతు నిర్వహించారు. ఎటువంటి పుకార్లను నమ్మకూడదని డీఎస్పీ రామకృష్ణ అన్నారు. ఎలక్ట్రికల్, మున్సిపల్ శాఖ, పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని బందోబస్తు చేస్తామని డీఎస్పీ తెలియచేశారు.
గణపతి నిమజ్జనం సందర్భంగా పోలీస్ కవాతు - ఆదోని
కర్నూలు జిల్లా ఆదోనిలో వినాయక నిమజ్జనం ఏర్పాట్ల సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఎటువంటి పుకార్లు నమ్మకూడదని డీఎస్పీ రామ కృష్ణ అన్నారు.
గణపతి నిమజ్జనం సందర్భంగా..పోలీస్ కవాతు నిర్వహించిన...డీఎస్పీ