కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరాణ కావడంతో ఆ ఊరిని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ ఖలీల్ మాస్క్ లేకుండా పొలానికి వెళ్తుండగా... బందోబస్తు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మాసుంబాషా, కానిస్టేబుల్ సీతారాముడు ఆపి.. మాస్క్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావంటూ వాలంటీర్‌పై దాడికి దిగారు. విషయం గ్రామస్ధులకు తెలియడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనాథ్ రెడ్డి గ్రామపెద్దలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.
మాస్క్ ధరించలేదని వాలంటీర్‌ను చితకబాదిన పోలీసులు..!
మాస్క్ ధరించలేదని వాలంటీర్‌ను పోలీసులు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సీఐ గ్రామపెద్దలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.
మాస్క్ ధరించలేదని వాలంటీర్‌ను చితకబాదిన పోలీసులు