ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో పోలీసుల తనిఖీలు.. రూ. 5 లక్షల 70 వేల నగదు పట్టివేత

పురపాలక ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు కట్టుదిట్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ లాడ్జీలో ఉన్న వ్యక్తి నుంచి రూ. 5 లక్షల 70 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును ఎన్నికల అధికారులకు అప్పగించారు.

police inspections in adoni
ఆదోనిలో పోలీసుల తనిఖీలు

By

Published : Feb 28, 2021, 12:13 PM IST

పురపాలక ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలోని లాడ్జిలలో పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. పట్టణంలోని క్రిష్ణ లాడ్జిలో మార్కాపురం చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి నుంచి 5 లక్షల 70 వేల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారపత్రాలు చూపించని కారణంగా.. ఆ మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు. నగదును ఎన్నికల అధికారులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details